News
విమాన చార్జీలు పెరగనున్నాయి
ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి ఎయిర్ రూట్లలో విమాన చార్జీలు మరింత పెరగనున్నాయి. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం లెవీ విధించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. దీంతో దూరాన్ని బట్టి వివిధ ప్రయాణాలపై లెవీ ఉంటుంది. యూడీఎన్ (ఉడె దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ప్రారంభించనుంది. చిన్న సిటీలకు కనెక్టివిటీ పెంచుతూ సామాన్య ప్రజలకు కూడా విమాన సేవలు అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ఉద్దేశించింది. కాగా, ప్రయాణించే దూరాన్ని బట్టి లెవీ ఉంటుందని పౌర విమానాయాన కార్యదర్శి ఆర్.చౌబే తెలిపారు. ఆ ప్రకారం 1000 కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ.7,500, 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ.8000 లెవీ విధించనున్నారు. 1500 కిలోమీటర్లకు మించి దూరం వెళ్లే విమానాలకు రూ.8,500 చొప్పున లెవీ ఉంటుంది. ఈ న్యూ టారిఫ్ ద్వారా ఏటా రూ.400 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉడాన్ కోసం ప్రభుత్వం రీజినల్ కెనెక్టివిటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనుందని, దీనికి అదనంగా రాష్ట్రప్రభుత్వాల ఫండిగ్ 20 శాతం ఉంటుందని చౌబే చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








